ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు..సుప్రీం తీర్పు

7
- Advertisement -

ఏపీ కానిస్టేబుల్, హోంగార్డ్ నియామకాల నోటిఫికేషన్ పై దాఖలైన పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది జూన్ లో ఎంపిక ప్రక్రియ మొదలుకాగా ఈరోజుతో ముగిసినట్లు కోర్టుకు చెప్పింది ప్రభుత్వం. ఈరోజు ఉదయం ఫలితాలు కూడా విడుదల చేసినట్లు వెల్లడించింది. హోంగార్డు ఎంపిక ప్రక్రియపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై పిటిషన్.. ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పలువురు అభ్యర్థులు.

జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ బలచంద్ర వరాలే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫలితాలు కూడా విడుదలయ్యాక జోక్యం చేసుకోవట్లేదని స్పష్టం చేసింది ధర్మాసనం.

Also Read:హరితసేనలో రాకింగ్ రాకేష్- సుజాత

- Advertisement -