బనకచర్లను అడ్డుకొని తీరుతాం:హరీష్

2
- Advertisement -

బనకచర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులే లేవని నిన్న లోకేష్ మాట్లాడుతున్నాడు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి.. ఒకటి కాదు రెండు కాదు 11 అనుమతులు ఉన్నాయి అన్నారు. బనకచర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడు… బనకచర్లను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం అన్నారు.

మా వాటా ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు …కాళేశ్వరం ప్రాజెక్టుకు పొక్క గొట్టడానికి ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. కాళేశ్వరం అనేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ..లోకేష్ బనకచర్ల కట్టి తీరుతామని అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడటం లేదు అన్నారు.

వాళ్ళు బనకచర్ల కడుతాము అంటేనేగా మేము అడ్డు చెప్పేదని రేవంత్ రెడ్డి అన్నాడు.. లోకేష్ ఏమో మేము కట్టే తీరుతామని అంటున్నాడు .. గురుదక్షణ చెల్లించుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని మాకు అర్థం అవుతుంది అన్నారు హరీష్.

Also Read:హరితసేనలో రాకింగ్ రాకేష్- సుజాత

- Advertisement -