ఏపీలో సరికొత్త పొత్తు?

38
- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలన్నీ గట్టి పట్టుదలగా ఉన్నాయి. కాగా ఈసారి ఏపీలో పొత్తుల అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలవబోమని ఒంటరిగానే పోటీ చేస్తామని అధికార వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక టీడీపీ జనసేన విషయానికొస్తే.. వైసీపీని గద్దె దించాలంటే పొత్తు అనివార్యంగా మారడంతో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే సింగిల్ గా బరిలోకి దిగలా లేదా టీడీపీ జనసేన కూటమితో కలిసి నడవలా ? అనే డైలమాలో ఉంది. ఇక ఇటీవల అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఏపీలో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికి ఎన్నికల సమయానికి పుంజుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో బలపడేందుకు కాంగ్రెస్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. లేస్ట్ పార్టీలతో చేతులు కలిపి ముందుకు సాగిస్తే పార్టీకి లాభం చేకూరుతుందనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట. తెలంగాణ ఎన్నికల్లో కూడా వామపక్షాలతో చేతులు కలిపిన హస్తం పార్టీ ఏపీలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల ఢిల్లీలో సమావేశం అయ్యారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల హస్తం నేతలు టీడీపీ జనసేన విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించారు. బీజేపీని వదిలి ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారు. అయితే ఆ రెండు పార్టీలు విముఖత చూపితే.. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల పొత్తు దాదాపు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సరికొత్త పొత్తు ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Also Read:చేవెళ్లపై గులాబీ జెండా ఎగరాలి

- Advertisement -