ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి నేడు. ఈసందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులు ఆయనకు విగ్రహానికి నివాళులర్పించారు. ఏపీలో వైయస్సార్ జయంతి వేడుకను చాలా గ్రాండ్ గా జరపుకుంటున్నారు వైయస్సార్ సీపీ కార్యకర్తలు. ఈసందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద వివాళులర్పించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
తాడిపత్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్నారు సీఎం జగన్. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇక వైఎస్ జయంతి రోజున ఏపీలో పలు పథకాలను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏటా జులై 8న రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.