ప్రతి పేదవాడికి అండగా ఉంటాః ఏపీ సీఎం జగన్

371
jagan

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈకార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 3,648 కిలోమీటర్లు ఈ నేల మీది నడిచినందకు, మీలో ఒకడిగా నిలిచినందుకు, ఆకాశమంత విజయాన్ని అందించిన మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెబుతున్నానని ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవిని తాను స్వీకరిస్తున్నానని తెలిపారు. పదేళ్ల తన రాజకీయ జీవితంలో పాదయాత్రలో ప్రజలందరి కష్టాలను విన్నానని, స్వయంగా చూశానని అన్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రతీ అవ్వ, తాతలకు, వితంతువులైన అక్కచెల్లెమ్మలకు పెన్షన్ 3000కు పెంచుతామని తాను హమీ ఇచ్చానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

అందులో భాగంగా ‘వైఎస్సాఆర్ పెన్షన్’ కానుక కింద అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి రూ.2,250 పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. దీన్ని వచ్చే ఏడాది 2500 చేస్తామనీ, మరుసటి ఏడాది 2,750కి పెంచుతామని పేర్కొన్నారు.ఈ ఫైలుపైనే తాను తొలిసంతకం పెడుతున్నానని ప్రకటించారు. అనంతరం ఫైలుపై జగన్ సంతకం పెట్టారు. నవరత్నాల పథకాల ద్వారా కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ప్రజలకు లబ్ధి కలిగించాలని జగన్ అన్నారు.