జగన్‌కు రాహుల్ విషెస్‌..

244
rahul jagan

ఏపీ సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. జగన్‌ను సీఎంగా ఎన్నకున్న ఏపీ ప్రజలతో పాటు మంత్రివర్గంలో చేరనున్న నేతలకు అభినందనలు తెలిపారు.

ఇక నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు డీఎంకే నేత స్టాలిన్..జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరై విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకార వేదికపై ప్రసంగించిన స్టాలిన్ ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ తన తండ్రి దివంగత మహానేత వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. జగన్ ది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. అలాగే ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ జగన్ కు అభినందనలు తెలిపారు.