తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలపగా తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ విషెస్ తెలిపారు. సీఎం కేసీఆర్ మంచి ఆరోగ్యం, ఆనందాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కేసిఆర్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.
దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు పదిహేనేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన పిడికిలి లక్ష్యాన్నిచేరుకునే దాకా దించలేదు. ఆయనే మన తెలంగాణ బాపు కేసీఆర్. 2001లో ఎగిరిన గులాబీ జెండా నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా రెపరెపలాడుతుంది. కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. అనతికాలంలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా…దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే.