గోపూజ చేసిన ఏపీ సీఎం జగన్‌..

178
gow puja
- Advertisement -

గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుతగా మున్సిపల్‌ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.

ఏపీ వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

- Advertisement -