తగ్గిన బంగారం ధరలు!

85
gold rate

బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గి రూ.45,750కు చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.500 తగ్గి రూ.49,900గా ఉంది.

బంగారం బాటలోనే వెండి కూడా దిగొచ్చింది. కేజీ వెండిపై రూ. 400 తగ్గగా వెండి ధర రూ.70,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగి ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1854 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 25.80 డాలర్లకు చేరింది.