తిరుపతిని స్పిరిట్యువల్ హబ్‌గా తయారుచేస్తాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కడప స్టీల్‌ప్లాంట్ వస్తోంది అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి సాధ్యం… విశాఖలో జూన్ 21న యోగా డేకు మోదీని ఆహ్వానించాం అన్నారు. మూడేళ్ల తర్వాత రాజధాని ప్రారంభానికి మరోసారి మోదీ రావాలి అన్నారు.
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తాం…IRR, ORRతో రాజధాని అభివృద్ధి చేస్తాం అన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులతో ప్రపంచంలోని అన్ని నగరాలకు అనుసంధానం…అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం అన్నారు. బిట్స్ పిలానీ, రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్స్ వస్తున్నాయి అన్నారు.అమరావతిని AI హబ్‌గా మారుస్తాం… కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అన్నారు.
నదుల అనుసంధానం పూర్తిచేస్తాం…వచ్చే ఏడాదికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తాం అన్నారు. అమరావతి రైతులు లాఠీదెబ్బలు తిన్నారు.. జైలుకు వెళ్లారు.. అమరావతి ఉద్యమకారులందరికీ నా సెల్యూట్ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజాతీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది…అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించాం అన్నారు. 5 కోట్లమంది ప్రజలు నా రాజధాని అన్ని గర్వంగా చెప్పుకునేలా చేస్తాం…వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తి చేస్తాం అన్నారు. ప్రధాని మోదీకి వ్యక్తిగతం కన్నా దేశమే ముఖ్యం… కులగణన దేశంలో బిగ్ గేమ్‌ఛేంజర్ కాబోతోంది అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ గొప్ప దేశంగా అవతరించబోతోంది….వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.

