అమరావతి..వికసిత్ భారత్‌కు నిదర్శనం:మోదీ

17
- Advertisement -

అమరావతి వికసిత్ భారత్‌కు నిదర్శనం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, ఒక శక్తి.. ఆంధ్రప్రదేశ్‌ను అధునాంద్ర తీర్చిదిద్దే శక్తి అమరావతికి ఉంది అన్నారు.

అమరావతి అనేది ప్రతి ఆంధ్రుడు అనుకునే విధాగం తీర్చిదిద్దుకోనుంది అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తాం… చంద్రబాబు ఒకప్పుడు హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసినప్పుడు నేను గుజరాత్ సీఎంగా ఉండి ఆయన చేసిన పనులు అన్నీ దగ్గర ఉండి తెలుసుకున్నారు. పెద్ద ప్రాజెక్టులు నిర్మాణంలో చంద్రబాబు కంటే నిష్టాతులు ఎవరూ లేరు.. ఇది నేను అనుభవంతో చెబుతున్నా అన్నారు.

వికసిత భారత్ నిర్మించే శక్తి ఇక్కడ ఉంది…. ఈరోజు 60వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు మోదీ. ఇంద్రలోకం రాజధాని అమరావతి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు కూడా అమరావతే. ఇది దేశానికే నిదర్శనం. ఒక స్వప్నం సాకారం అవుతుందని నా కళ్ల ముందు కనిపిస్తోంది అని స్పష్టం చేశారు మోదీ.

Also Read:HIT 3: నాని కెరీర్‌లోనే బిగ్గెస్ హిట్!

- Advertisement -