టీడీపీ రెడీ..బీజేపీ నాట్ రెడీ?

20
- Advertisement -

ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీ, జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ 141 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుండగా, జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక బీజేపీ విషయానికొస్తే 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. సీట్ల పంపకాలు జరిగిపోవడంతో ప్రచారంపై దృష్టి పెడుతూ వస్తున్నారు పార్టీల అధినేతలు. అయితే ఏపీలో ఏమాత్రం బలంలేని బీజేపీకీ పది, అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించడం ఏంటనే ప్రశ్నలు అడపా దడపా వినిపిస్తూనే వస్తున్నాయి..

ఈ నేపథ్యంలో సీట్లలో మార్పులు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వనపర్తి, ఉండి అసెంబ్లీ సీట్లతో పాటు, నరసాపురం పార్లమెంట్ సీటు కూడా మార్పులు చేయాలని టీడీపీ భావిస్తోంది. ఉండి సీటును బీజేపీకీ కేటాయించి నర్సాపురం ఎంపీ సీటు కావాలని టీడీపీ ఆరాటపడుతోంది. మొదట ఉండి సీటు టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ రెబెల్ నేత రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరడంతో సీట్ల మార్పు చేయక తప్పని పరిస్థితి. రఘురామ టీడీపీ తరుపున నర్సాపురం నుంచి పోటీ చేయిస్తే మేలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.

అయితే నర్సాపురం ఎంపీ స్థానానికి మొదట బీజేపీ అభ్యర్థిని కేటాయించిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్నికల ముందు సీట్ల మార్పు కోసం కూటమి నేతలు ఇటీవల భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంతో పవన్, పురందేశ్వరితో పాటు బీజేపీ రాష్ట్ర ఎన్నిఊకల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యి సీట్ల మార్పు పై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఆయా ష్టానల్లో అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ రెడీగానే ఉన్నప్పటికి బీజేపీ మాత్రం ససేమిరా అంటున్నట్లు టాక్. దీనిపై అధిస్థానందే తుది నిర్ణయమనేది రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఒకవేళ సీట్ల మార్పుకు బీజేపీ నో చెబితే.. చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరి సీట్ల మార్పులో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

- Advertisement -