ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో కేరళ సీఎం భేటీ..

18

కేరళ సీఎం పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం విజయన్ కూడా పాల్గొంటున్నారు. కాగా, నగరానికి వచ్చిన కేరళ సీఎంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను పినరయి విజయన్ ప్రగతి భవన్‌లో కలిశారు. కాగా, విజయన్ వెంట సీతారాం ఏచూరి (సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి), సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు.