నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు!

2
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ అయ్యాయి. రూ.3500 కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాల డిమాండ్ చేయడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 600 ఆసుపత్రుల్లో ఓపీలతో పాటు అన్ని వైద్య సేవలు నిలిచిపోయాయి.

దాదాపు రూ.3500 కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ మేరకు ఆందోళన బాటపట్టాయి. తమ బిల్లులు వచ్చేవరకు ఆరోగ్యశ్రీ సేవలు.. బందు చేస్తున్నట్లు ప్రకటన చేశాయి.

ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఏపీలో కొనసాగనున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read:ఒకే ఏడాదిలో దెబ్బతీశారు: హరీష్‌ రావు

- Advertisement -