భరత్‌ కోసం అనుష్క స్పెషల్ సాంగ్‌ !

197
Anushka special song for mahesh
- Advertisement -

‘సూపర్‌’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాలతార అనుష్క. ‘సూపర్‌’ విజయంతో ఇక తను వెనక్కి తిరిగి చూడలేనంత ఆఫర్లు ఆమెని వరించాయి. అందుకే పదేళ్ళనుంచి ఈ స్వీటీ బిజీ హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తూ తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగింది అనుష్క. ‘బాహుబలి -2’ ఘన విజయం తర్వాత జాతీయ స్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. సైజ్‌ జీరో’ చిత్రం కోసం ఈ అమ్మడు ఒళ్లు పెంచిన అనుష్క విజయాన్ని అందుకోలేకపోగా, తన బాడీ షేప్‌ మొత్తం పాడు చేసుకుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా వెలిగిన అనుష్క.. ఇప్పుడు ఆ పాత్రలను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ప్రభాస్‌తో మూడు సార్లు జట్టు కట్టిన అనుష్కనే సాహో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. సాహోలోని ఆమె పాత్రకు మించి బరువు ఉండడంతో.. సాహో సినిమాలో ఆఫర్‌కు గండి కొట్టింది..

Anushka

దీంతో ఆమె తర్వాతి ప్రాజెక్టుల విషయంలో అందరిలోనూ కుతూహలం నెలకొంది. ఆమె త్వరలో ఒక స్పెషల్ సాంగ్లో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రంలో కావడం విశేషం. ఈ మేరకు ఆమెతో చర్చలు జరిగాయని, కథతో పాటు పాటకు కూడా ప్రాముఖ్యత ఉండటంతో అనుష్క ఈ ఆఫర్ పట్ల సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తుంది.

- Advertisement -