అనుష్క కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది ..!

345
Anushka Shetty to be completely silent in her next movie
- Advertisement -

భాగమతి సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాలోనూ కనిపించకపోవడం ,ఆమె సినిమా కబుర్లు వినిపించకపోవడం అనేవి, ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరచిందనే చెప్పాలి. అయితే ఎవ్వరికి తెలియకుండా, చడీ చప్పుడు లేకుండా ఓ సినిమా ఒప్పేసుకుని టైటిల్ ని కూడా ఫిక్స్ చేసేసింది స్వీటీ.

Anushka Shetty to be completely silent in her next movie

“వస్తాడు నారాజు” సినిమా తో డైరెక్టర్ గా పరిచయమైన హేమంత్ మధుకర్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి “సైలెంట్ ” అనే టైటిల్ ని ఓకే చేసేసుకున్నారట .ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో అనుష్క సరసన తమిళ విలక్షణ నటుడైన మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. సాధారణంగా మాధవన్ నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి కానీ ఎప్పుడు మాధవన్ తెలుగు సినిమా లో నటించలేదు. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టబోతున్న మాధవన్ కు ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.

Anushka Shetty to be completely silent in her next movie

వైవిధ్యభరితమైన కధాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉందట. ఈ సినిమా పూర్తివివరాలేవి ఇంకా బయటకు రాకపోయినా సినిమా టైటిల్ రావడం ఆలస్యం, సోషల్ మీడియా లో వీర విహారం చేసేస్తోంది. స్వీటీకి ఈ సినిమా భాగమతి లా మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందా, లేక పేరుకి తగ్గట్టు సైలెంట్ గా వెళ్లిపోతుందా అనేది తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -