‘వంగవీటి’ టైటిల్ సాంగ్ తొలగించారు…

142
KAMMA KAAPU Song Removed From Vangaveeti

టాలీవుడ్ లో సంచలనాలకు మరో పేరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లో కంటే… పబ్లిసిటీలోనే ఈమధ్య ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఏదోక సినిమా ప్రకటించడం, షూటింగ్ కు ముందే దానికి మంచి హైప్ తేవడం వర్మకు అలవాటు. వంగవీటి చిత్రంతో మరో సంచలనానికి తెరతీసినట్టు చెబుతున్న వర్మ విజయవాడలో రౌడీయిజం ఎలా ఉండేదీ అనేది తన సినిమాలో చూపించవచ్చని అనుకుంటున్నారు..ఈ సినిమా తీస్తానని వర్మ ప్రకటించినప్పటి నుంచి ఆ మూవీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వివాదాలు నెలకొన్నాయి. కోర్టుల్లో కేసులు కూడా వేశారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి వర్మ ఓ పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచాడు.

‘ఇది వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి’ అంటూ ప్రారంభమయ్యే ఈ పాటను సిరాశ్రీ రాయగా, సుసర్ల రాజశేఖర్ సంగీత దర్శకత్వం వహించి.. టైటిల్ సాంగ్ పాడి…యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘ఇది వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి’ అంటూ ప్రారంభమయ్యే వివాదాస్పదంగా మారింది. కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.

కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ పాటను తీసేస్తున్నట్లు వర్మ తాజాగా ట్వీట్‌ చేశారు. ఇది భావోద్వేగాలతో కూడుకున్న చిత్రమని, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని పేర్కొన్నారు. ఇదిఇలా ఉండగా డిసెంబర్ 3(రేపు) విజయవాడలోని కొనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో వంగవీటి ఆడియో విడుదల కానుంది.

ramgopal varma