బొమ్మాళికి పెళ్లి ఘడియ రాలేదట..

1201
Anushka
- Advertisement -

దక్షిణాది ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ ఎవరంటే టక్కన గుర్తొచ్చే పేరు అనుష్క. 35ఏళ్ల ఈ ముదురుభామకు సగం వయసు వాకిలి దాటిపోయినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. తానింకా పదహారేళ్ల పడుచు భామలెక్క పెళ్లా దానికి అంత తొదరేం వచ్చింది అంటూ రోజులు గడుపుతోంది. అయితే ఎప్పుడు పెళ్లిమాట ఎత్తని అనుష్క మొదటి సారిగా తన పెళ్లిపై నోరు విప్పింది. అలాగే గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లపైనా కూడా మాట్లాడింది.

అనుష్కపై ఈ మధ్య కాలంలో పలు వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క పెళ్లి చేసుకుందని కొన్ని సార్లు, ఓ పారిశ్రామికవేత్తతో రహస్యంగా ఎంగేజ్ మెంట్ జరిగిందని మరికొన్ని సార్లు వార్తలు వచ్చాయి. దీనిపై బొమ్మాలి తనదైన స్టైల్లో సమాధానం చెప్పింది. తనకు పెళ్లి వయసు వచ్చేసిందని కానీ..పెళ్లి చేసుకోవడానికి సరైన వరుడు మాత్రం ఇంతవరకు దొరకలేదని చెప్పింది.

Anushka

ఇంట్లో వాళ్లు అదే పని మీద ఉన్నారని చెప్పేసింది. నచ్చిన వ్యక్తి దొరికితే త్వరలోనే పెళ్లి కబురు వినిపిస్తానని చెప్పుకొచ్చింది. ఇక తనపై వస్తున్న వార్తలను విని నవ్వుకున్నానని తెలిపింది. పెళ్లి అనేది మన చేతుల్లో లేదని… పెళ్లి ఘడియలు వచ్చినప్పుడు అది ఆగదని… తనకు ఇంకా ఆ ఘడియలు వచ్చినట్టు లేవని చెప్పింది అనుష్క. ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పింది. మరి ఈ బొమ్మాళికి పెళ్లి ఘడియలు ఎప్పుడు వస్తాయో. నచ్చిన వరుడు ఎప్పుడు దొరుకుతాడో..పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి. బాహుబలి2 తర్వాతనైనా పెళ్లి చేసుకుంటుందని అందరు అనుకుంటున్నారు. మరి అమ్మడుకు ముహుర్తం ఎప్పుడు కుదురుతుందో చూడాలి.

Anushka

- Advertisement -