సరిగ్గా 12 సంవత్సరాల క్రితం 2005 లో ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేసింది అనుష్క. హీరోయిన్ గా తానేంటో నిరూపిస్తూనే..స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ కొట్టేసింది.
నాగార్జున తో ‘సూపర్’ అంటూ వచ్చిన ఈమె సూపర్ స్పీడ్‌గా తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకుంది.
నేటికీ పుష్కలమైన సినిమా అవకాశాలతో మంచి జోరుమీదుంది. తాను చేసిన ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘దేవసేన’ పాత్రలైతే ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అనుష్క సినీప్రయాణం ఈరోజుతో 12 సంత్సరాలు పూర్తయ్యింది.
అయితే తన 12 సంవత్సరాల సినీప్రయాణం కంప్లీట్ అవడంతో ఈ విషయాన్ని అనుష్క తన పేస్ బుక్ ద్వారా సోషల్ మీడియాకు చెప్పింది. తాను చేసిన సినిమాలతో కూడిన 12 అక్షరంతో చేసిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘నాగార్జున, పూరిజగన్నాధ్ తో నా మొదటి సినిమా ‘సూపర్’ చేసి 12 ఏళ్ళు అయింది. ఇదో ఆధ్బుతమైన ప్రయాణం. నన్ను ఆదరించి అభిమానిస్తున్న స్నేహితులు, ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు, నా అభిమానులందరికీ కృతజ్ఞతలు’ అని రాసి పోస్ట్ చేసింది.
ప్రస్తుతం అనుష్క జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు.