డ్రగ్స్‌: సమంత భలే ఎస్కేప్‌ అయింది..!

213
- Advertisement -

ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్‌ సికు సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ తన 150వ షో రూమ్‌ను వరంగల్‌లోని హన్మకొండలో ఏర్పాటు చేసింది. ఆ షోరూమ్‌ను సమంత శనివారం ప్రారంభించారు.

Samantha Ruth Prabhu Denis to Respond on Tollywood in Drug..

త్వరలో అక్కినేని ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్న శామ్‌..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 6, 7న నాగ చైతన్యతో తన వివాహం గోవాలో జరుగుతుందని చెప్పింది. అంతేకాదు.. తమ వివాహం చాలా సింపుల్‌గా జరుగుతుందని కూడా సెలవిచ్చేసింది సమంత.

ఇక రేపు ఇంగ్లండ్‌తో వరల్డ్‌కప్ ఫైనల్‌లో తలపడబోతున్న ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్‌కు ఈ సందర్భంగా సమంత ఆల్ ది బెస్ట్ చెప్పింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు డ్రగ్స్ కేసు..టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై సమంతను మీడియా ప్రశ్నించగా.. డ్రగ్స్‌ కేసుపై మాట్లాడేందుకు సమంత నిరాకరించింది. సింపుల్‌గా ‘నో కామెంట్’ అని దాని గురించి మాట్లాడకుండానే ఎస్కేప్‌ అయిపోయింది సమంత.

- Advertisement -