ఐఎస్‌బీలో తొలి ఆదివాసి

256
indian school business
- Advertisement -

ఐఎస్‌బి..ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ పేరు వినని వారుండరు. ఎందుకుంటే హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సీటు సంపాదించడమంటే సాధారణ విషయం కాదు. ఇందులో ప్రవేశం కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇందులో చదివిన వారి కోసం ప్రపంచంలోని టాప్ కంపెనీలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి. అయితే ఇక్కడ చదివే వారు అంతా కోటీశ్వరుల బిడ్డలే. అలాంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చరిత్రలో తొలిసారి ఓ ఆదివాసీకి ఎంట్రీ లభించింది.

అత్యంత క్లిష్టమైన ఎంపిక ప్రక్రియలో తన టాలెంట్‌తో సీటు దక్కించుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన రోషన్. ఉట్నూరులో రూ.15 లక్షల వ్యయంతో పప్పు ధ్యానాల ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రోషన్. రుణం కోసం 27 బ్యాంకుల్లో దరఖాస్తులు చేసుకున్నాడు. అన్ని బ్యాంకుల్లో అప్లికేషన్ రిజక్ట్. చివరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ దృష్టికి తీసుకెళ్లి లోన్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఏఆర్‌కే ఆగ్రో ఇండస్ట్రీస్‌ని ఏర్పాటుచేసి కేవలం మూడు నెలల్లోనే 48 ఆశ్రమ పాఠశాలలకు 400 క్వింటాళ్ల పప్పును సరఫరా చేశాడు.

వ్యాపారంలో మెళకువలతోపాటు.. పారిశ్రామికత వేత్తగా ఎదగటానికి ఐఎస్‌బీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రోషన్. ఇందులో జాయిన్ అయిన తొలి ఆదివాసీని కావటం గర్వంగా ఉందని… ఆదివాసీల్లోనూ ఎంతో ప్రతిభ ఉందని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారని రోషన్ తెలిపారు. అగ్రికల్చర్‌లో బీటెక్ పూర్తిచేసి అత్రాం రోషన్ కుమార్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రోశన్‌తో పాటు ఆదిలాబాద్,ఖమ్మం,వరంగల్‌ జిల్లాలకు చెందిన ఏడుగురు ఐఎస్‌బీకి ఎంపికయ్యారు.

- Advertisement -