హ్యాపీ బర్త్ డే..అనుష్క శర్మ

35
- Advertisement -

రబ్ దే బనాదీ జోడీ చిత్రంతో వెండితెరకె పరిచయమైన బ్యూటీ అనుష్క శర్మ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అనుష్క..తర్వాత వెండితెరపై సక్సెస్‌ ఫుల్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. యశ్ రాజ్‌ ఒక్క ఆడిషన్‌తోనే 3 సినిమాల కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు అనుస్క. తనదైన నటనతో అందరిని మెప్పించింది. ఇవాళ అనుశ్క పుట్టిన రోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

1988 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కల్నల్ అజయ్ కుమార్- అషిమా శర్మ దంపతులకు జన్మించారు అనుష్క.మోడలింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఆరంగంలో కెరీర్ ప్రారంభించిన అనుష్క కెరీర్‌ను యశ్ రాజ్ ఆడిషన్ మార్చేసింది. ఒకేసారి మూడు సినిమాల కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇక తొలిచిత్రం 2010లో రబ్‌దే బనాదీ జోడి చిత్రానికి గాను బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు,2011లో బ్యాండ్ బాజా బరాత్‌కు ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది. తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి 2017 డిసెంబర్ 11న ఇటలీలో పెళ్లిచేసుకున్నారు. వీరికి ఒక పాప వామిక. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా ఫిల్లోరీ అనే చిత్రాన్ని నిర్మించారు. 2018 నాటికి భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది అనుశ్క.

Also Read:నేడు మహారాష్ట్ర అవతరణ దినోత్సవం

క్రైమ్ థ్రిల్లర్ NH10 (2015), దిల్ ధడక్నే దో (2015), ఏ దిల్ హై ముష్కిల్ (2016), సూయ్ ధాగా (2018) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అనుశ్క కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం సుల్తాన్. అమీర్ ఖాన్‌తోPK చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాను నటుడిగా కంటే సైనికాధికారి కూతురిని అని చెప్పుకోవడంలో గర్వపడతానని పలు ఇంటర్వ్యూలలో సగర్వంగా చెప్పారు అనుశ్క.

Also Read:నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు..

- Advertisement -