వాళ్లిద్దరూ..ఒక్కటయ్యారు

199
Anushka Sharma And Virat Kohli Are Married
- Advertisement -

అంతా అనుకున్నదే జరిగింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ ఇంటివాడయ్యాడు.కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో  ప్రేమలో మునిగితేలుతున్న విరాట్‌ ఇటలీలో పెళ్లిచేసుకున్నాడు. అతిరథ మహారథులు, పలువురు సెలబ్రిటీల సమక్షంలో టస్కనీ రిసార్ట్‌లో కోహ్లి-అనుష్క ఒక్కటయ్యారు. ట్విట్టర్‌ వేదికగా విరుష్క జోడి తమ పెళ్లి గురించి  ప్రకటించారు. ఆహ్లాదకరంగా ఉన్న పెళ్లి ఫొటోల్ని తమ ట్విటర్‌ పేజీల్లో పంచుకున్నారు.

Anushka Sharma And Virat Kohli Are Married
హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని రోజుల పాటు ఇటలీలోని విహరించబోతున్న కోహ్లి, అనుష్క.. తర్వాత స్వదేశానికి తిరిగొస్తారు. ఢిల్లీలో 21న ,ముంబైలో 26న  విందు ఇవ్వనున్నారు. క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు ఆ విందులో పాల్గొననున్నారు.

Anushka Sharma And Virat Kohli Are Married
నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న కోహ్లి, అనుష్క డిసెంబరులో పెళ్లి చేసుకోబోతున్నారని గత నెలలోనే ఊహాగానాలు మొదలయ్యాయి. భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాక ఏ సిరీస్‌కూ దూరం కాని కోహ్లి.. విశ్రాంతి పేరుతో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లు రెండింటికీ దూరమవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.  అనుష్క ప్రతినిధి ఈ విషయాన్ని ఖండించాడు. అయినా పెళ్లి వార్తలకు తెరపడలేదు. చివరగా అంతా అనుకున్నట్లే విరుష్క జోడి ఒక్కటైంది.

- Advertisement -