షాకిచ్చిన సమంత…!

181
Samantha from Rangasthalam will Shock You
- Advertisement -

1985 నాటి పరిస్ధితుల నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రంగస్థలం. రామ్ చరణ్,సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. మొదట చెప్పినట్లు కాకుండా.. 1985 అనే అక్షరాలను టైటిల్ నుంచి తీసేశారు. చిట్టిబాబుగా రామ్‌ చరణ్‌ లుక్ ఫ్యాన్స్‌ని ఫిదా చేయగా  ఇప్పుడు సమంతకు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఆన్ లైన్ లో హల్ చల్ చేసేస్తున్నాయి.

Samantha from Rangasthalam will Shock You
వీటిలో సమంత లుక్ ని చూసి అభిమానులు కేకలు పెట్టేస్తున్నారు. ఇప్పటివరకు తన గ్లామర్‌తో కుర్రకారు మైండ్ బ్లాక్ చేసిన సామ్‌..తాజాగా ఉరమాస్‌ లుక్‌తో దర్శనమిచ్చింది. ఒక స్టిల్‌లో గేదెల‌ను లాక్కుంటూ వెళుతుంటే.. మ‌రో స్టిల్‌లో పొయ్యి ముందు కూర్చుని మ‌హా మాస్‌గా వంట చేస్తోంది. సమంత పోస్టర్లను చూస్తే.. అసలు ఇలా కనిపిస్తున్నది టాప్

హీరోయిన్ సామ్ నేనా అనిపించక మానదు. అలాగని సమంత అందానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కాకపోతే పక్కా నేటివిటీతో.. తెలుగు పల్లెటూరి భామల ఒరిజినల్ అందం ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది సమంత. పీరియాడిక్ మూవీకి కమర్షియల్ హంగులు అద్ది.. పక్కా పల్లెటూరి కామెడీ సినిమాగా చూపించేస్తున్నాడు.  2018 మార్చి 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Samantha from Rangasthalam will Shock You

- Advertisement -