అనుష్క శర్మ ఇప్పటికే ఒక పాపకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తన బేబీ వామికతో ఆమె బిజీగా ఉన్నారు. అందుకే, అనుష్క శర్మ సినిమాలకు కాస్త దూరంగా ఉంది. మరోవైపు, ఆమె ఎప్పటికప్పుడు మీడియాకి, కెమెరామెన్లకి ఒక విజ్ఞప్తి చేస్తూనే ఉంది. తన కూతురు వామిక ఫోటోలను ఫొటోగ్రాఫర్లు మరో రెండేళ్ల వరకు తీయొద్దు అని అనుష్క శర్మ కోరింది.
బాలీవుడ్ లో స్టార్ హీరోల, స్టార్ హీరోయిన్ల ప్రతి మూమెంట్ ని ఫొటోలుగా తీస్తారు. వాళ్ళ పిల్లల ఫోటోలను కూడా బంధిస్తారు. ఐతే, తన కూతురు వామిక ఫోటోల లీక్ పై మాత్రం అనుష్క శర్మ చాలా కఠినంగా ఉంటుంది. తన కూతురికి ఐదేళ్లు వచ్చే వరకు కెమెరామెన్లు తమ కెమెరాలకి పని కల్పించొద్దు అని అనుష్క శర్మ తాజాగా వేడుకుంటోంది.
కావాలంటే.. నా ఫోటోలు, నా భర్త విరాట్ కోహ్లీ ఫోటోలు ఎన్నయినా తీసుకోండి. కానీ నా కూతురు వామిక ఫోటోలను సోషల్ మీడియాలో, మీడియాలో పబ్లిష్ చేయొద్దు అని అడుగుతోంది అనుష్క శర్మ. “నా కూతురు అందరి అమ్మాయిల్లా పెరగాలి. చిన్నప్పటి నుంచే కెమెరాలు, మీడియా ఫోకసులు వద్దు. ఇదే నా కోరిక” అని చెబుతుంది విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.
ఇవి కూడా చదవండి..