నవీన్ సినిమా నుండి తప్పుకున్న స్వీటీ!

23
naveen

జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. తాజాగా అనుష్క శెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.

గతేడాది ‘నిశ్శబ్దం’ సినిమాతో అమెజాన్‌లో దర్శనం ఇచ్చినా సరికొత్త కథాంశంతో ఇప్పటివరకు తెలుగు తెరపై టచ్ చెయ్యని సబ్జెక్ట్‌తో అనుష్క సినిమా వస్తుందని ప్రచారం జరిగిన తాజాగా ఈ ప్రాజెక్టు నుండి అనుష్క తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ స్క్రిప్ట్ ఆమెకు బాగానే నచ్చినప్పటికీ, ఎందుకో వెనకడుగు వేసిందట. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో, మహేశ్.పి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో వేరే కథానాయికను చూస్తారా.. లేదా ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేస్తారా.. అనేది చూడాలి!