తారక్‌పై అనుపమ్‌ ప్రశంసలు

26
- Advertisement -

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్. తనకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని, ఎన్టీఆర్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తారక్ పనితనం ఎంతో ఇష్టమని, ఆయనకి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో దోస్తీ సాంగ్‌ని షేర్ చేయగా ఇది వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వార్ 2, దేవర రెండు పాన్ ఇండియా చిత్రాలు కాగా ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:వెరికోవైన్స్ ను తగ్గించే ‘వజ్రాసనం’!

- Advertisement -