అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే శతమానంభవితితో సక్సెస్ అందుకుని ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. త్రివిక్రమ్ దర్శకత్వంలోని అ..ఆ చిత్రంలో నితిన్ సరసన నటించిన ఈ మళయాళి బ్యూటీ కుర్రకారు మతిపొగొట్టింది. ఇప్పటి వరకు అనుపమా తెలుగులో నటించింది మూడు సినిమాలై అయిన అవి బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.
అయితే అనుపమాపరమేశ్వరన్ ఇక తెలుగు స్టార్ సరసన కూడా కనిపించడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, సరసన అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని కూడా వార్తలు వినిపించాయి. దానికి కారణం మాత్రం అనుపమా తన రెమున్యరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడమే అంటూ అప్పట్లో ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా చెర్రి సినిమాలో దర్శకుడు సుకుమార్… అనుపమాను రిజెక్ట్ చేయడంతో తన ట్వీట్టర్ వేదికగా వివాదస్పద కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది ఈ మళయాళీ సుందరాంగి.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్,ఎన్టీఆర్ సినిమాలు మిస్ అవ్వడంపై అనుపమా ఈవిధంగా స్పందించింది…… ‘దాదాపు ఖరారైందనుకున్న దశలో రామ్‌చరణ్ సినిమా కోల్పోయాను. ఓ పెద్ద సినిమా మిస్సైనపుడు ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయినప్పటికీ ఆ చిత్ర దర్శక, నిర్మాతలతో నాకు ఇప్పటికీ మంచి అనుబంధమే ఉంది. రామ్‌చరణ్ చాలా మంచి వ్యక్తి. నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. రామ్‌చరణ్‌తో చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇక, నేను ఎన్టీయార్ సినిమా కూడా కోల్పోయానని వార్తలు వచ్చాయి. అసలు ఎన్టీయార్‌తో చేయమని నన్నెవరూ అడగనే లేదు. అలాంటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేద’ని చెప్పిందిఅనుపమాపరమేశ్వరన్.
ఆ సినిమా మిస్సైనప్పుడు బాధపడ్డా…..!
- Advertisement -
- Advertisement -