లిప్ లాక్‌..హద్దులు దాటిన అనుపమ!

165
rowdy boys
- Advertisement -

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమ కథా చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. వరుసగా ఆఫర్లను చేజిక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా అనుపమ ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది.

ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ కెరీర్ ప్రారంభంలో గ్లామర్ షోకి,లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఆ హద్దులను చెరిపేసి దేనికైనా రెడీ అంటోంది. ప్రస్తుతం యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘రౌడీ బాయ్స్‘ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం హద్దు మీరిందట.

సినిమాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు లిప్ లాక్ లకు ఓకే చెప్పిందట. ఈ సినిమా నుండి విడుదలైన రొమాంటిక్ సాంగ్ చూసి అంతా షాక్ తిన్నారు. ఘాటైన రొమాన్స్ లో అను పిచ్చెక్కించింది. ఆఫర్ల కోసం గ్లామర్ హద్దులను చెరిపేసిన అను…ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -