బుమ్రా, అనుపమా ప్రేమలో పడ్డారా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

1014
anupama-bumrah
- Advertisement -

క్రికెటర్లు, హీరోయిన్లు చాలా మంది ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. అయితే కొంత మంది చట్టాపట్టాలేసుకుని తిరిగగా..మరికొంత మంది పెళ్లి కూడా చేసుకున్నారు. తాజాగా మరో క్రికెటర్ హీరోయిన్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, టీంఇండియా ఫేస్ బౌలర్ బుమ్రాలు ప్రేమించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతంది.

వీరిద్దరూ సోషల్‌మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. మరో విషయం ఏంటంటే.. సోషల్‌మీడియాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమేనట. అంతేకాదు వీరిద్దరూ పెట్టే పోస్ట్‌లను కూడా తెగ లైక్‌ చేసుకుంటూ ఉంటారట. దాంతో నెటిజన్లు వీరి గురించి గుసగుసలాడుకుంటున్నారు.

bumra Anupama

ఈ నోట ఈనోట ఈ వార్త తన వరక వచ్చే సరికి స్పందించింది అననుపమా. బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని తమ మధ్య ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. అనుపమా క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.

- Advertisement -