రోజాకు సీఎం జగన్ ఫోన్…బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం

464
jagan Phone Call To Roja
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా కు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి జగన్. వెంటనే అమరావతికి బయలుదేరి రావాలని ఆదేశించారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న రోజా వెంటనే అమరావతికి బయద్దేరారు. ఇటివలే జరిగిన క్యాబినెట్ ఏర్పాటులో రోజా పేరు లేకపోవడంతో ఆమె కొంత నిరాశకు గురైన విషయం తెలిసిందే.

దీంతో గత వారం నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో రోజాను సీఎం జగన్ ఆహ్వానించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రోజాకు ఏదైనా నామినేటేడ్ పదవి ఇస్తారని తెలుస్తుంది. ఆర్టీసీ చైర్మన్ లేదా మహిళా కమిషన్ ను చైర్మన్ ను కట్టబెట్టనున్నట్లు సమాచారం.

రెండున్నర ఏళ్ల తర్వాత రోజాకు మంత్రివర్గంలో చోటు కల్పించే విషయమై హామీ ఇవ్వనున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు విజయసాయి రెడ్డి కూడా రోజాకు ఫోన్ చేసి హామి ఇచ్చినట్లు తెలుస్తుంది.

- Advertisement -