మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ ఈ నెల 17న విడుదల కానుండడంతో మరో మూడు రోజుల్లో టైగర్ దండయాత్రను చూడబోతున్నాం. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ రిచ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ ,కార్తికేయ 2 తర్వాత మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. టీజర్‌ను విడుదల చేయడానికి ముందు మేకర్స్ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.
ప్రొడక్షన్ హౌస్‌లో గతంలో వచ్చిన రెండు సినిమాల్లో భాగమైన అనుపమ్ ఖేర్ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐబి ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా పరిచయం అయ్యారు అనుపమ్ ఖేర్.
’టైగర్ నాగేశ్వరరావు’ రవితేజకు హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున, మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. తారాగణం: రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు
Also Read:మోడీకి పోటీగా ప్రియాంక గాంధీ?