కరీంనగర్ లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు

402
Karimnagar
- Advertisement -

కరోనాను కట్టడి చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు నగర మేయర్ వై.సునిల్ రావు. కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రొటెక్టర్ 600 స్పిక్లింగ్ యంత్రంతో స్ప్రే చేసే కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ వాహనం ద్వారా దాదాపు 40 ఫీట్ల వెడల్పుతో స్ప్రే చేసే సామర్యం ఉండటంతో నగర మేయర్ వై.సునిల్ రావు ప్రైవేటు సంస్థ నుండి తెప్పించారు. ఒకే సారి 500 లీటర్లకు పైగా స్పింక్లర్ ద్వారా స్ప్రే చేసే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ఈ యంత్రం ద్వారా హైపో క్లోరైడ్ లిక్విడ్ ను నింపి నగరంలోని ప్రధాన రహాదారులు, జన సమూహా ప్రాంతాలలో స్ప్రే చేయడం జరుగుతుంది. అంతే కాకుండా మరో 3 ట్రాక్టర్ స్పింక్లర్లతో కూడ నగరంలో వైరస్ నశించే విధంగా స్ప్రే చేయడం జరుగుతుంది.

Spray

నగరంలోని మార్కెట్ ప్రాంతో పాటు టవర్ సర్కిల్ ఏరియాలో డ్రోన్ ల ద్వారా లిక్విడ్ ను స్ప్రే చేయడం జరిగింది.ఈ సంధర్బంగా నగర మేయర్ వై.సునిల్ రావు మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్ట మైన చర్యలు చేపడుతుంది. నగర వ్యాప్తంగా ఈ నేల 31 వరకు ప్రతి రోజు స్ప్రే చేయడంతో పాటు బ్లీచింగ్ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తామన్నారు. జనతా కర్ఫ్యూ కు సహాకరించిన నగర ప్రజలందరికి ధన్యనాధాలు. అలాగే లాక్ డౌన్ కార్యక్రమానికి కూడ పూర్తిగా సహాకరించండి మన కరీంనగర్ ను కరోన విముక్తి నగరంగా మార్చాలన్నారు. మనకు మనం స్వీయ నియంత్రన పాటిస్తే కరోనా వైరస్ ను తరిమి కొట్టవచ్చన్నారు. 31 వ తేది వరకు ప్రజలు ఎవరు ఇండ్ల నుండి బయటకు రాకుండ జాగ్రత్తలు తీస్కోవాలన్నారు. ప్రజలంతా నగరపాలక సంస్థ మరియు జిల్లా యంత్రాంగానికి సహాకరించి కరోనా వైరస్ నుండి విముక్తి చెందాలన్నారు.

- Advertisement -