‘అంతకు మించి’ అంతంత మాత్రమే-మూవీ రివ్యూ

503
Anthaku Minchi Movie Review
- Advertisement -

Anthaku Minchi Movie Reviewన‌టి ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్ గా రాణిస్తూనే..అడ‌పా ద‌డ‌పా హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. గ‌తంలోనూ హ‌ర్ర‌ర్ జోన‌ర్లో వ‌చ్చిన నెక్ట్స్ నువ్వేలో న‌టించిన ర‌ష్మీ, మ‌రోసారి అలాంటి జోన‌ర్ లో వ‌స్తున్న అంత‌కు మించి మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా పోస్టర్స్‌ తో యూత్‌ మతి పోగొట్టింది రష్మి. జానీ అనే కొత్త డైరెక్ట‌ర్ ఈ సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగుపెడుతుండగా, హీరో జై కు కూడా ఇదే తొలి మూవీ కావ‌డం విశేషం. ఇటు హీరోగా, అటు నిర్మాతగా అంత‌కుమించి తో వ‌స్తున్న జై ఏ మేర‌కు స‌క్సెస్ అయ్యాడో చూద్దాం.

కథ:
దెయ్యాలున్నాయ‌న్న అనుమానంతో ఓ భ‌వ‌నానికి అక్కడి ప్రజలంతా దూరంగా జీవిస్తుంటారు. అయితే ఒకానొక సందర్భంలో చాలెంజ్‌ రూపంలో ర‌ష్మీ, జై లు అదే భ‌వ‌నంలో ఉండేందుకు నిర్ణయించుకుంటారు. భ‌వ‌నంలో నివ‌సిస్తే 5 కోట్లు స్వంతం అవుతాయని తెలిసి అందులో ఉండిపోతారు. కానీ, ఆ స‌మ‌యంలో వాళ్ల‌కు దెయ్యాలు క‌నిపించాయా..? భ‌వ‌నానికి సంబంధించి ఎంక్వైరీ చేసేందుకు వ‌చ్చిన ఆఫీస‌ర్ కు ఏం జ‌రిగింది. దెయ్యాలు, భూతాల‌ను బ‌య‌టికి పంపించే స్వామీజీలు కూడా ఆ భ‌వ‌నాన్ని చూసి ఉలిక్కి ప‌డ‌టం వంటి విష‌యాల‌తో స‌స్పెన్స్ అండ్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల‌ను గ‌ట్టిగానే భ‌య‌పెట్టింద‌ని చెప్పాలి. ఇంత‌కీ భ‌వ‌నంలో దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న‌ది అస‌లు కథ.

 Anthaku Minchi Movie Review

ప్ల‌స్ పాయింట్స్‌:

పెద్దగా ఈ సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ అంటూ ఏమీ లేవు. సినిమా రిలీజ్‌ అవకముందు పోస్టర్స్‌ లలో రష్మిగౌతమ్‌ చూపించిన అందాలే కానీ..అంతకుమించిన అందాలు కూడా ఇందులో కవిపించవు. ఇక జనాలు ధియేటర్‌లోకి రావడానికి మాత్రం పోస్టర్స్‌ల లో కనిపించిన రష్మి అందాలే అని చెప్పాలి.

మైన‌స్ పాయింట్స్:

అన్ని మైనస్‌ పాయింట్సే…’అంతకు మించి’లో…ఇంతకుమించి ఏం చెప్పలేము. ఈ సినిమా హర్రర్‌ త్రిల్లర్‌ నేపథ్యంలో ఉంటుందని ప్రచారాన్ని కల్పించారు. కానీ..మొదట చెప్పినట్టుగా ఇందులో హర్రర్‌ ఎలిమెంట్స్‌ ని ప్రేక్షకులను ఆకట్టలేకపోయాయనే చెప్పాలి.

తీర్పు:

నెక్ట్స్ నువ్వే త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి జోన‌ర్ నే ఎంచుకున్న ర‌ష్మీ, ఈ సినిమాలో సూప‌ర్ ఫెర్ఫార్మెన్స్ ను క‌న‌బ‌రిచింది. ఇక స్టోరీకి త‌గ్గ‌ట్లుగానే ఆమె అందాల‌న్నీ ఆర‌బోయ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. హీరో కం ప్రొడ్యూస‌ర్ అయిన జై ఈ సినిమాతోనే ఆరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో ఫ‌ర్వాలేద‌నిపించాడు. హ‌ర్ర‌ర్ జోన‌ర్లో అనేకం సినిమాలు వ‌చ్చిన‌ప్పటికీ ఈ సినిమా కాస్త ప్ర‌త్యేకంగా రూపొందింద‌నే చెప్పాలి. ఓవ‌రాల్ గా అంత‌కుమించి అనే టైటిల్ మార్క్ ను మాత్రం రీచ్ అవ్వ‌లేద‌నే చెప్పుకోవాలి.

సినిమా పేరు: అంతకుమించి
విడుదల తేదీ: 24/08/2018
రేటింగ్:2.5/5
నటీనటులు: జై, ర‌ష్మీ గౌత‌మ్, అజ‌య్ ఘోష్, మ‌ధునంద‌న్, హ‌ర్ష‌, టి.ఎన్.ఆర్ త‌దిత‌రులు
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్
నిర్మాతలు: జై, స‌తీష్, ప‌ద్మ‌నాభ‌రెడ్డి
దర్శకత్వం: జానీ

- Advertisement -