మహర్షిని కలిసిన గోవిందం..!

232
Vijay Devarakonda in Mahesh Babu Maharshi Set
- Advertisement -

అర్జున్ రెడ్డి తో వన్ నైట్ స్టార్ అయిపోయి ఇప్పుడు గీత గోవిందం తో సంచలన విజయాన్ని అందుకున్న మన విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ హీరో అయిపోయాడు. తను ఎక్కడికెళ్లినా సోషల్ మీడియా లో అదో పెద్ద విశేషమైపోతోంది. తను ఏం చెప్పినా అది నేటి కుర్రకారులో ఓ ట్రెండ్ లా మారిపోతోంది. ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుతో మన అర్జునరెడ్డి దిగిన ఫోటో సోషల్ మీడియా లోకి రావడం ఆలస్యం. కొన్ని గంటల్లో వైరల్ అయిపోయింది.

Vijay Devarakonda in Mahesh Babu Maharshi Set
ప్రస్తుతం మహర్షి షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా షూటింగ్ జరుగుతున్న సమయం లో విజయ్ దేవరకొండ అక్కడికి చేరుకొని, మహేష్ ,వంశీ ల మధ్య లో నుంచుని ఒక ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియా లో దుమ్ము లేపుతోంది. విజయ్ దేవరకొండ ఆ ఫోటో ని పేస్ బుక్ లో పెట్టి “ఒకప్పుడు ఆయన సినిమాకు టిక్కెట్ల కోసం ఫైటింగ్ ..ఇప్పుడు ఆయన సెట్స్ లో చిల్లింగ్ ” అంటూ పోస్ట్ చేయడంతో ఆ ఫోటోకి మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవల మహేష్, రామ్ చరణ్, జూనియర్ ఎం.టి.ఆర్ కలిసి దిగిన ఓ ఫోటో తప్ప వేరే ఏ ఫోటోకి ఇంత క్రేజ్ రాలేదంటే అతిశయోక్తి కాదు..

- Advertisement -