అబ్దుల్ క‌లామ్ ఊర్లో ‘అంత‌రిక్షం’ టీమ్..

296
Varun-Tej, Aditi-Rao-hydari
- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ రెండు హిట్ల‌తో మంచి ఫామ్ లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం రెండు మెగా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. విక్ట‌రీ వెంక‌టేశ్ తో చేస్తున్న ఎఫ్ 2, యువ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అంత‌రిక్షం లో చేస్తున్నాడు. ఎఫ్ 2మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

varun sankalp

సంక‌ల్ప్ రెడ్డితో చేస్తున్న మూవీలో వ‌రుణ్ కు జోడిగా అదితి రావు హైద‌రీ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో జ‌రుగుతుంది. భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ఎపీజె అబ్దుల్ క‌లామ్ సొంత ఊరు అయిన రామేశ్వ‌రం అని మ‌న‌కు తెలిసిందే. రామేశ్వ‌రంలోని అబ్దుల్ క‌లాం చ‌దువుకున్న స్కూల్లో ఈమూవీ చిత్రిక‌రిస్తున్నార‌ట‌.

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి చ‌దువుకున్న స్కూల్లో అంత‌రిక్షం షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ట్లు ఓ ఫోటోను షేర్ చేసింది హీరోయిన్ అదితిరావ్ హైద‌రీ. ఆ ఫోటోలో వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ బెంచిల‌పై కూర్చోని ముచ్చటిస్తున్నారు. స్పేస్ థ్రిల్ల‌ర్ గా ఈసినిమా తెర‌కెక్కుతుంద‌న్న విష‌యం తెలిసిందే. సంక‌ల్ప్ రెడ్డి న‌టించిన ఘాజి చిత్రం మంచి టాక్ తెచ్చుకోవ‌డంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -