అకట్టుకుంటున్న ‘మహాసముద్రం’ ఫస్ట్‌ లుక్‌..

214
Maha Samudram
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకుడు అజయ్‌ భూపతి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్ .. అదితీరావు .. సిద్ధార్థ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం నుండి అదితిరావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ‘మహా’ అనే పాత్రలో అదితి కనిపించనుందని పేర్కొంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ను బట్టి ఈ సినిమాలో ఎమోషన్స్‌కి ప్రాధాన్యత ఎక్కువని అర్థమవుతోంది.

ఈ సినిమాలో అదితీరావు పాత్రకు ప్రాధాన్యత ఎక్కువని తెలుస్తోంది. అందువల్లనే ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆమె ఫస్టులుక్ ను వదిలారు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. కన్నీళ్లను వర్షిస్తూ.. తడారిపోయిన పెదలతో ఆమె ఈ ఫస్టులుక్ పోస్టర్‌లో కనిపిస్తోంది. తనకి ఎవరో దూరమవుతున్నట్టు .. తాను ఎవరినో విడిచి వెళుతున్నట్టు బాధతో కూడిన భావన ఆమె కళ్లలో కనిపిస్తోంది.

- Advertisement -