తొలి రోజే రూ.7 కోట్లు కొల్లగొట్టిన హాలీవుడ్ మూవీ..

239
ant-man-wasp
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఆ సినిమాలు భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబడుతుంటాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందే ఈ చిత్రాలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్ట పడతారు. ఇక ఇండియాలోనూ హాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెటె ఉంది. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్, జురాసిక్ పార్క్ వంటి చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

Ant-ManAndTheWasp

తాజాగా నిన్న విడుదలైన ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ సినిమాకి ఒక్కరోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టే హాలీవుడ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ సినిమాకి ఇండియా మొత్తం అన్ని భాషలు కలుపుకుని రూ. 7.05 కోట్లు రాబట్టి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించిందని, ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్‌ ట్వీట్ చేశాడు. చీమ మనిషికి సంబంధించిన కథనాలలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రేపు ఆదివారం కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -