ఎమ్మెల్యేల కొనుగులు.. ఆసక్తి రేపుతున్న ట్విస్ట్ లు !

184
- Advertisement -

ఈ మద్య కాలంలో తెలంగాణను కుదిపేసిన అంశం.. టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగులు వ్యవహారమనే చెప్పాలి. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు బీజేపీ అధిష్టానం పన్నిన వ్యూహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది కే‌సి‌ఆర్ సర్కార్. పూర్తి ఆధారాలతో బీజేపీ పెద్దల కుచల బుద్దిని ప్రజలకు చూపెడుతూ వారి ప్రణాళికలను బట్టబయలు చేశారు కే‌సి‌ఆర్. ఇక ఈ వ్యవహారంలో డిల్లీ పెద్దల హస్తం ఉండడంతో నిజాలు నిగ్గు తేల్చే వరకు వదిలే సమస్యే లేదని సి‌ఎం కే‌సి‌ఆర్ సీట్ బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ కేసు లో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతీ, నందకుమార్, సింహయాజులు వంటి వారు అరెస్ట్ కాగా వారికి తాజాగా హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సింహయాజులు ఇప్పటికే విడుదల కాగా నంద కుమార్, రామచంద్రభారతీ కూడా తాజాగా విడుదల అయ్యారు. .

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే వీరిద్దరి పై ఉన్న పాత కేసుల కారణంగా పోలీసులు ఆ వెంటనే మళ్ళీ వీరిని అరెస్ట్ చేశారు. నందకుమార్ పై చీటింగ్ కేసులు, రామచంద్రభారతి పై నకిలీ డాక్యుమెంట్స్ కేసుల కారణంగా మళ్ళీ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత బిఎల్ సంతోష్, కేరళకు చెందిన తుశూర్, కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చుతూ సిట్ బృందం ఏసీబీ కోర్టు లో మేమో దాఖలు చేసింది. అయితే ఈ మెమోను కొట్టి వేస్తూ ఊహించని విధంగా తీర్పు ఇచ్చింది ధర్మాసనం. అయితే ఏసీబీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించింది సిట్. దీనిపై తుది విచారణ నేడు జరగనుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ట్వీట్ ల మీద ట్విస్ట్ లు సాగుతూ పోలిటికల్ హిట్ ను మరింత పెంచుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -