బన్నీ అభిమానులకు మరో సర్ ప్రైజ్

191
ala vaikuntapuram lo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటికి వచ్చి, ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. తాజాగా మరోసాంగ్ ను విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్.

బాలల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుంచి 3వ సాంగ్ టీజర్ ను వదలనున్నారు. ‘ఓ మై గాడ్ డాడీ’ అంటూ ఈ సాంగ్ టీజర్ సాగనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సాంగ్ టీజర్లో ఇద్దరు స్పెషల్ గెస్టులు కనిపించి సర్ ప్రైజ్ చేస్తారనే విషయాన్ని పోస్టర్ ద్వారా తెలియజేశారు. కాగా ఈమూవీన సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈమూవీపై బన్నీతో పాటు ఆయన అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు.