భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్…

50
bharath biotech

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్ని తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ కీలకదశకు చేరుకోగా భారత్‌లో భారత్ బయోటెక్ మూడోదశ క్లీనికల్ ట్రయల్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

కొవాక్సిన్ క్లీనికల్‌ ట్రయల్స్‌లో జంతువులపై సత్ఫలితాలనిస్తోందని ప్రకటించిన భారత్ బయోటెక్ తాజాగా మరో శుభవార్త తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న అభ్యర్థుల్లో ప్రతిరక్షకాలను ప్రేరేపించాయని, తీవ్రమైన ప్రతికూల సంఘటనలు నమోదు చేయలేదని మొదటి దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాలను వెల్లడించింది.

వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలాంటి మందులు అవసరం లేకుండానే తగ్గిపోయినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని 25 కేంద్రాల్లో 26వేల మందిపై పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యాక్సిన్‌ భద్రత, పనితీరుపై సంతృప్తి చెందితే దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు అనుమతి లభించనుంది.