హ్యాపీ బర్త్ డే అడవిశేష్‌…మేజర్ ఫస్ట్ లుక్

56
major

క్ష‌ణం, గూఢచారి వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు అడవి శేష్. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న శేష్‌..ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఫస్ట్ లుక్‌ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం ఎలా పుట్టింది, ఫ‌స్ట్ లుక్ ఎలా చేసాం అన్న‌ది ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు అడ‌వి శేష్.

వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత నేప‌థ్యంలో పాన్ ఇండియ‌న్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. మ‌హేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గూఢ‌చారి ఫేం శ‌శికిర‌ణ టిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రినో కాపాడారు ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్.