ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ప్రజలకు 200 రకాల ప్రభుత్వ సేవలు అందనున్నాయి. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కోసం మన మిత్ర పేరుతో దేశంలోనే తొలిసారి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభించింది
అన్ని రకాల సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు, రెవిన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డుల సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా ప్రజలు పొందవచ్చు. వీటితో పాటు కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు, ఇతర ప్రభుత్వ చెల్లింపులు చేసుకోవచ్చు .
తొలివిడతలో 161 సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ సేవలను 200 కు పెంచింది. ఈ 200 సేవలతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ” మన మిత్ర ” సేవల కోసం ఈ నెంబర్ ను 95523 00009 సంప్రదించాలి.
Also Read:కాంగ్రెస్‌లో హీట్..ఢిల్లీకి జగ్గారెడ్డి