ప్రియుడు అంటే ఎలా ఉండాలి, ప్రియురాలిని కంటి రెప్పలా కాపాడుకోవాలి. ప్రాణాలనే కాదు.. అంతకంటే ముఖ్యమైన మానాన్ని కాపాడాలి. కానీ గుంటూరుకి చెందిన జోసఫ్ అనే ప్రియుడు మాత్రం తన ప్రియురాలి మానం పోతున్నా పట్టించుకోలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం అందించలేదు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ఏ చిన్న ప్రయత్నమూ చేయలేదు.
గుంటూరు జిల్లా కాకాని మంగళగిరిలో ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది ఓ అమ్మాయి. తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన జోసఫ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఇదే క్రమంలో విధులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి ప్రియుడు జోసఫ్ బైక్ పై ఇంటికి బయలుదేరింది. వీరిని అనుచరించి వచ్చిన ఇద్దరు తాగుబోతులు పెదవడ్డపూడి వద్ద అడ్డగించి, జోసఫ్ ను కొట్టి పంపంచి, ప్రియురాలిపై రాత్రంతా అత్యాచారం చేశారు.
అలా వెళ్లిన జోసఫ్, కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటనను అడ్డుకోవడానికి ఏ చిన్న ప్రయత్నమూ చేయలేదు. మరుసటి రోజు ఉదయం, నిస్సాయ స్థితిలో పడిఉన్న ఆమెను స్థానికులు చూసి, ఆమె బంధువులకు చెప్పడంతో.. ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆ ఇద్దరి నిందితులతో పాటు, ప్రియురాలిని పట్టించుకోకుండా వెళ్లిన జోసఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.