మరో నాలుగు రోజులు వర్షాలు..

31
hyderabad
- Advertisement -

రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో పలు కాలనీలు నీట మునిగాయి.

మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నిజాంపేట బండారి లేఅవుట్‌, బృందావన్‌కాలనీ, బాలాజీనగర్‌, శ్రీనివాసకాలనీ, బాచుపల్లి, రాజీవ్‌గాంధీనగర్‌, జయదీపికా ఎస్టేట్‌ తదితర ప్రాంతాల్లో నాలాలు లేకపోవడంతో రోడ్లపై నడుము లోతున వరద నీరు నిలిచింది.

- Advertisement -