అప్పట్లో సుచీ లీక్స్ కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ల గుండెల్లో హడలుపుట్టించిన విషయం తెలిసిందే. ఆ లీక్స్ తో స్టార్ సెలెబ్రిటీల దిమ్మతిరిగిపోయింది.
అయితే ఈ తరహా లీక్స్ ఆ రెండు పరిశ్రమల వరకే పరిమితం కాదు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లను కూడా కుదిపేస్తోందని తాజాగా అర్థమవుతోంది.
హాలీవుడ్ హాట్ గాళ్, ప్రఖ్యాత గాయని అన్నెహాతవే కి సంబంధించిన నగ్న ఫోటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. ఇవి నేరుగా సదరు కథానాయిక వ్యక్తిగత అకౌంటు నుంచి లీకవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే అన్నెహాతవే ట్విట్టర్‌ని ఎవరో హ్యాక్ చేసి ఇలా నగ్న ఫోటోల్ని బయటపెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసిన ఫోటోలు అంటూ వాదిస్తున్నారు.
ఇవి కేవలం సైబర్ ఎటాక్స్ వల్ల హ్యాకర్స్ చేసిన పని అని ఖండిస్తున్నారు. ప్రస్తుతం అన్నెహాతవే లీకేజీపై సైబర్ క్రైమ్ సెల్లో కేసు నమోదైంది. విచారణ సాగుతోంది.
ఇదిలా ఉండగా గతంలోనూ పలువురు స్టార్ల ఫోటోలు ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. పాప్‌స్టార్ మిలీ సైరస్, జెన్నిఫర్ లారెన్స్, కేట్ అప్టన్, కెలీ కూకూ వంటి ప్రముఖ సెలబ్రిటీల ప్రయివేటు ఫోటోల్ని ఆన్లైన్లో లీక్ చేశారు.