అక్టోబర్‌ 2న అన్నా హజారే దీక్ష

319
anna hazare
- Advertisement -

అవినీతిపై పోరాటానికి మరోసారి సిద్ధమయ్యారు సామాజిక కార్యకర్త అన్న హజారే. లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం జాప్యాన్ని నిరసిస్తు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని తన సొంత ఊరు రాలేగావ్‌ సిద్ధిలో దీక్షకు దిగనున్నట్లు చెప్పారు. లోక్‌పాల్‌ను తీసుకురావడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆయన నిప్పులు చెరిగారు.

లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటు విషయంలో గడిచిన నాలుగేళ్లు హామీలకు పరిమితమైందని అన్నా హజారే విమర్శించారు.లోక్ పాల్‌ పై బీజేపీ ఇచ్చిన హామీని నిలుపుకోలేక పోయిందని…తక్షణమే ఈ బిల్లును అమోదించాలని డిమాండ్ చేశారు.

లోక్‌పాల్ బిల్లుకు 2014 జనవరిలో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈబిల్లు అమోదం పొందలేదు.లోక్‌పాల్‌ చట్టం కోసం 2011లో హజారే నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అవినీతిని నిర్మూలించేందుకు లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ 2011 ఏప్రిల్‌ 5న నిరశన దీక్షకు దిగారు. ఆయన ఉద్యమానికి మేధా పాట్కర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌బేడీ, జయప్రకాశ్‌ నారాయణ తదితరులు మద్దతు పలికారు. ఆయన ఉద్యమంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం
దిగొచ్చింది. లోక్‌పాల్‌ చట్టాన్ని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

- Advertisement -