ఢిల్లీలో కేజ్రీవాల్ వల్లే ఆప్ ఓడిపోయిందన్నారు అన్నా హజారే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను చెప్పినదానిని పట్టించుకోలేదని, లిక్కర్ పాలసీపై మాత్రమే దృష్టి సారించారని అన్నారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసింది. అందుకే వారికి ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయి అన్నారు హజారే.
తాను ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్‌కి చెప్పాను కానీ, ఆయన నా మాటలను పట్టించుకోలేదు అన్నారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ చిక్కుకున్నాడని.. ప్రజలు ఇది చూశారని హజారే అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు సర్వసాధారణం. కానీ, ఎవరైనా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవా అన్నారు.
తాను మొదటి నుంచీ ఆప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని హజారే వెల్లడించారు. కేజ్రీవాల్ రాజకీయ ప్రయాణం నుంచి తన సంబంధాన్ని తెంచుకున్నట్లు హజారే నొక్కి చెప్పారు.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండించిన నిఖిల్