పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులను గెలిపించండిః ఎన్నారై టీఆర్ఎస్

281
Anil Kurmachalam nri trs
- Advertisement -

ఏప్రిల్ 11వ తేదిన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్దులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఎన్నారై టీఆర్ఓస్ వ్యవస్ధాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచలం. ఈసందర్భంగా లండన్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కోసం ఎంపీ కవిత గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్న కృషి గొప్పదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయం లో లండన్ వీధుల్లో రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ పోరాటాలు చేశామని..మళ్లీ ఇప్పుడు పసుపు బోర్డుకై ఎంపీ కవిత పోరాటానికి సంఘీభావంగా లండన్ లో నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు.

ఎంపి కవిత పోరాటాన్ని నిజామాబాద్ ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ ప్రజలు ఎంపీ కవితను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే ఈసారి తప్పకుండా కావాల్సినన్ని నిధులు తీసుకువస్తారని చెప్పారు. జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్ , బీజేపీలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని హామిలు ఇప్పుడు ఓట్ల కోసం గుర్తుకు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు మరోసారి తగిన బుద్ది చెబుతారని తెలిపారు.

- Advertisement -