Trisha:’త్రిష’ కి యానిమల్ ఎఫెక్ట్

66
- Advertisement -

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన మూవీ ‘యానిమల్’. డిసెంబర్ 1 పాన్ ఇండియాలో రిలీజైన ఈ సినిమా రోజురోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ వెళ్తోంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు కలెక్షన్లను ట్రాక్ చేసే విశ్లేషకులు వెల్లడించింది. మూడు రోజులూ కలిపి భారత్ లో హిందీ వెర్షన్ కే సుమారు రూ.175 కోట్ల వరకూ రావడం విశేషం. తర్వాత తెలుగు వెర్షన్ నిలిచింది. అయితే, యానిమల్ సినిమాలో ఆడవాళ్లను చులకనగా చూపించారని చాలా విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ‘యానిమల్’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టిన త్రిషపై విమర్శలు వెల్లువెత్తాయి. యానిమల్ సినిమాకు కల్ట్ స్థాయి ఉందంటూ త్రిష తాజాగా ఇన్‌స్టాలో కామెంట్ పెట్టారు. ఇది చూసి నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. గతంలో స్త్రీపురుష సమానత్వంపై గొంతెత్తిన త్రిష ఇప్పుడిలా స్త్రీ ద్వేషం ప్రదర్శించే పాత్రకు బ్రహ్మరథం పట్టడమేంటని ప్రశ్నించారు. దీనితో, త్రిష తన కామెంట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే, త్రిష పోస్ట్ వైరల్ కావడంతో ఆమె పై నెగిటివ్ పోస్ట్ లు పెడుతున్నారు.

సరే విమర్శలు ఎలా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ ఊచకోత కొనసాగిస్తోంది. రణ్‌బీర్ కపూర్ సినీ కెరీర్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.116 కోట్లు రాబట్టింది. ఒక్క షారుఖ్ ఖాన్ కి తప్ప ఈ ఘనత మరో హీరోకి దక్కలేదు. ఇప్పుడు రణబీర్ కపూర్ కి దక్కింది. అందుకే, రన్బీర్ కపూర్ కి జాతీయ అవార్డు సైతం వస్తోందని ఆశిస్తున్నారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -